- Step 1
ముందుగా ఒక పాన్ లో 1/2టేబుల్ స్పూన్ వెన్న వేయాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు మరియు ఖీమా వేసి, ఫ్రై చేసుకోవాలి.
- Step 2
ఇప్పుడు అందులోనే 1/4చెంచా పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 3
అంతలోపు మరో పెద్ద బౌల్ తీసుకొని అందులో నీళ్ళు మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి. పిండిని మెత్తగా మ్రుదువుగా కలుపుకొని 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఈ పిండి నుండి కొద్దిగా (నిమ్మకాయంత సైజు)తీసుకొని చేతిలోనే వెడల్పుగా చేసుకోవాలి .
- Step 5
తర్వాత అలా వెడల్పుగా చేసుకొన్న మైదాలో కొద్దిగా ఖీమా మిశ్రమాన్ని పెట్టి నీట్ గా అన్నివైపులా క్లోజ్ చేయాలి .
- Step 6
ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో నీళ్ళుపోసి, ఒక రౌండ్ ప్లేట్ లో మమూస్ పెట్టాలి. ఆ ప్లేట్ ను కుక్కర్లో పెట్టి 10-15నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
- Step 7
అంతే ఇప్పుడు యమ్మీ ఖీమా మమూస్ రెడీ . చాలా టేస్ట్ గా ఉండే మమూస్ ను చిల్లీ సాస్ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి.