- Step 1
గసగసాలూ, నువ్వులూ, జీడిపప్పూ, కొబ్బరి పొడి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలూ, ఆవాలు వేయించాలి.
- Step 3
అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి ఎరుపురంగులోకి వచ్చాక అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపూ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి.
- Step 4
చింతపండు రసం ఉడికి, నూనె పైకి తేలాక చేపముక్కలూ, కాసిని నీళ్లు పోసి మంట తగ్గించేయాలి.
- Step 5
చేపముక్కలు పూర్తిగా ఉడికాక ముందుగా చేసుకున్న మసాలా వేసి.. బాగా కలపాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి.