- Step 1
పుట్టగొడుగుల్ని కడిగి, తుడిచి పెట్టుకోవాలి.
- Step 2
పిండికోసం తీసుకున్న పదార్థాల్లో నూనె తప్ప మిగిలినవన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని కలపాలి. ఈ మిశ్రమం దోశపిండిలా ఉండాలి.
- Step 3
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి.
- Step 4
ఒక్కో పుట్టగొడుగును తీసుకుని ఈ పిండిలో ముంచి, కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేగాక తీసుకోవాలి.
- Step 5
ఇప్పుడు మంచూరియా మసాలా తయారు చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి.
- Step 6
అది వేడయ్యాక ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేయాలి.
- Step 7
రెండు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి తరుగు వేయాలి.
- Step 8
అవి కాస్త వేగాయనుకున్నాక కారం, సోయా, చిల్లీసాస్, కొద్దిగా ఉప్పూ, మిరియాలపొడి వేసి పెద్దమంటపై వేయించాలి.
- Step 9
ఇందులో ముందుగా వేయించుకున్న పుట్టగొడుగు ముక్కల్ని వేసి బాగా కలిపి దింపేసి ఉల్లికాడల తరుగు వేస్తే చాలు.