- Step 1
కూరగాయలను సన్నగా తరగాలి. ఒక టేబుల్ స్పూన్ నూనెను బాణలిలో వేసి వేడి చేయాలి.
- Step 2
అల్లం, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. క్యారెట్ తురుము, బంగాళ దుంపల ముద్ద, తరిగిన బీన్స్, కేప్సికమ్ వేయాలి.
- Step 3
ఓ రెండు నిమిషాలు ఆగి పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. వీటన్నిటినీ 5 నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 4
తర్వాత కిందికి దించి చల్లారనిచ్చి, ఆపై గుడ్డు వేసి బాగా కలపాలి.
- Step 5
ఈ మిశ్రమాన్ని లాలిపాప్స్ తీరులో తయారు చేయాలి. ఈ లాలిపాప్స్‌లో కేరెట్ స్టిక్స్‌ను జాగ్రత్తగా గుచ్చాలి.
- Step 6
ఆపై వీటిని బ్రెడ్ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బాగా వేగించాలి. వీటిని సెజువాన్ సాస్‌తో గాని, టొమాటో కెచప్‌తో గాని తింటే చాలా బావుంటాయి.