- Step 1
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి తక్కువ మంట మీద అన్ని రకాల మసాలాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఎండు మిర్చి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
వేయించుకున్న పదార్థాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- Step 3
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి, అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాలు, పెరుగు, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ సమయంలోనే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి.
- Step 4
తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేగించుకోవాలి.
- Step 5
ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన చికెన్, వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే 1/4కప్పు నీళ్ళు జోడించి, చిక్కగా ఉడికించాలి. మరీ గ్రేవీలా కాకుండా చిక్కగా ఉండేట్లు చూసుకోవాలి.
- Step 6
ఇప్పుడు, కొబ్బరి తురుము, చింతపండు పేస్ట్, బెల్లం, నెయ్యి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అవసరమైతే అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవచ్చు.
- Step 7
మొత్తం మిశ్రమాన్ని 10 నిముసాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే చికెన్ చిల్లీ గీ రోస్ట్ రిసిపి రెడీ .వేడి వేడిగా వడ్డించడమే ఆలస్యం ఇష్టంగా తినేస్తారు.