- Step 1
ఒక పాత్రలో మైదా, తగినంత ఉప్పు, నిమ్మరసం తీసుకోవాలి. అందులో గోరువెచ్చని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ.. చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి.
- Step 2
దానిపై తడి వస్త్రాన్ని కప్పి కాసేపు నాననివ్వాలి.
- Step 3
ఇంతలో పొయ్యిమీద బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి.
- Step 4
అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక కొద్దిగా ఉప్పూ, కారం వేసి పొయ్యి కట్టేయాలి.
- Step 5
ఆ వెంటనే మరీ అటుకుల మిశ్రమం, కొత్తిమీర తరుగు వేయాలి. అన్నింటినీ బాగా కలిపితే కూర తయారైనట్లే.
- Step 6
నానిన మైదా మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒకదాన్ని తీసుకుని చిన్న చపాతీలా వత్తి పెనంపై ఓ అరనిమిషం కాల్చుకుని తీసుకోవాలి.
- Step 7
ఆ చపాతీని తీసుకుని మధ్యలో చెంచా ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి.. సమోసాలా వచ్చేలా అంచుల్ని చుట్టి మూసేయాలి.
- Step 8
దీన్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుంటే చాలు.