- Step 1
ముందుగ కాకరకాయలను బాగా కడిగి సన్నని చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి .
- Step 2
తరవాత చింతపండు లో నీళ్ళు పోసి రసం తీసి పెట్టుకోవాలి .
- Step 3
ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో నూనె వేసి సెనగపప్పు ,మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర , మెంతులు, ఇంగువ ,పసుపు, ఎండుమిరప ముక్కలు వేసి పోపు దోరగా వేయించాలి .
- Step 4
వేగిన పోపులో ఉప్పు,కరివేపాకు,కాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి కూర ముక్కలు ములిగె లాగా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి.
- Step 5
తరవాత కూరలో కొద్దిగా నిరున్నప్పుదు బెల్లం , చింతపండు రసం పోసి దగ్గర పడే వరకు గరిటతో కలుపుతూ మాడకుండా చూడాలి .
- Step 6
ఇప్పుడు చిక్కగా అవుతున్న కూరలో బియ్యపుపిండి వేసి బాగా కలిపి ఒక ఐదు నిముషాలు ఉంచి దించేయాలి .