- Step 1
ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మూడింటిని బాగా మిక్స్ చేసి జల్లు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత ఇందులో పంచదార పొడి మరియు బట్టర్ రెండూ వేసి బాగా మిక్స్ చేయాలి. బట్టర్ స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేయాలి.
- Step 3
ఇప్పుడు అందులోనే కండెన్డ్ మిల్క్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.
- Step 4
సగం పాలు కూడా పోసి మొత్తం మిశ్రమం స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో అడుగున ఒక కప్పు ఉప్పు వేసి మంటను మీడియంగా పెట్టి, ఉప్పును వేడెక్కనివ్వాలి.
- Step 6
కండెన్స్డ్ మిల్క్ మైదా మిక్స్ ను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బాగా గిలకొట్టాలి. పిండి మొత్తం స్మూత్ గా అయ్యే వరకూ ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. మరికొద్దిగా పాలు పోసి స్మూత్ గా కలుపుకోవాలి.
- Step 7
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ ను బేకింగ్ బౌల్ కు రాసి, దాని మీద ఒక టేబుల్ స్పూన్ మైదాను చిలకరించి తర్వాత లోపలి బౌల్ లోపలిబాగాన్ని కవర్ చేయాలి.
- Step 8
ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో జీడిపప్పు మరియు ద్రాక్ష వేసి మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్ చేసి బేకింగ్ బౌల్లో మిక్స్ చేయాలి.
- Step 9
ఇప్పుడు ఈ బేకింగ్ బౌల్ ను కుక్కర్ లో పెట్టి మూత పెట్టాలి. విజిల్ పెట్టకూడదు.
- Step 10
తక్కువ మంట మీద 30-40నిముషాలు ఉడికించుకోవాలి. 40నిముషాల తర్వాత మూత తీసి బేకింగ్ బౌల్లో కేక్ మొత్తం, అన్ని వైపులా బ్రౌన్ కలర్ లోకి మారిందో లేదో సరిచూసుకోవాలి.
- Step 11
తర్వాత చాకును కేకు లోపలికి చొప్పించి చూడాలి. పైకి తీసినప్పుడు , సులువగా చాకు బయటకు వస్తే అది తప్పనిసరిగా కేక్ తయారైనట్లే. అలా కాకుంటే మరో 10నిముషాలు తక్కువ మంట మీద తిరిగి బేక్ చేసుకోవాలి.
- Step 12
కేక్ రెడీ అయిన తర్వాత బేకింగ్ బౌల్ ను బయటకు తీసి, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
- Step 13
చల్లారిన తర్వాత బేకింగ్ బౌల్ ను ఒక సర్వింగ్ ప్లేట్ మీద బోర్లించి కేక్ ను నిధానంగా రిమూవ్ చేయాలి. కేక్ మొత్తం బటకు తీసుకొన్న తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేయాలి.
- Step 14
అంతే క్రిస్మస్ స్పెషల్ ఎగ్ లెస్ కేక్ రెడీ...