- Step 1
ముందుగా కమలా తొక్క లోపల తెల్లగా ఉండే తీగల్ని ముందుగా తీసేయాలి. లేకుంటే కర్రీ చేదు అయిపోతుంది.
- Step 2
ఆపై ఉల్లి, టొమాటో ముక్కలు తరగాలి. కమలా తొక్కల్ని సన్నటి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
- Step 3
వేడిచేసిన నూనెలో ఆవాలు వేసి అవి చిటపటమనేప్పుడు శనగ పప్పు, మినపప్పు, జీలకర్ర వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
- Step 4
తరువాత ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఉల్లి ముక్కలు మెత్తబడగానే కమలా తొక్కల తరుగు, టొమాటొ తరుగు వేసి మూడు నిమిషాలు ఉడికించాలి
- Step 5
ఆ తరువాత కారం, ధనియాల పొడి వేసి మరో నిమిషం పాటు వేయించాలి. పచ్చి వాసన పోయేవరకు స్టవ్ మీదే ఉంచాలి.
- Step 6
అంతే కమలా తోక్క గ్రేవీ రెడీ. గ్రేవీ ఇష్టం లేనివారు అందులో గ్లాసు నీరును పోసి స్టవ్ మీద ఉడికించాలి.
- Step 7
అంతే కమలా తొక్క కూర రెడీ అయినట్లే.. ఈ కూరని వేడివేడి అన్నం, ఇడ్లీ లేదా దోసెలతో తింటే చాలా బాగుంటుంది.