అలసందలనగానే వడలే గుర్తుకొస్తాయి. చాలా కమ్మగా...రుచికరంగా ఉండే అలసంద వడలంటే అందరికీ ఇష్టమే. అయితే అదే అలసందలతో వివిధ రకాలు వంటలు వండుతారు. గొంగూర అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? ఫైబర్ ఎక్కువగా ఉన్న అలసందలు లేదా బొబ్బర్లు షుగర్ లెవెల్‌ను సాధారణంగా ఉంచుతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు వైరస్, జలుబు ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతాయి. రక్తంలో కొలెసా్ట్రల్‌ను తగ్గించి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉన్న అధిక ఫైబర్ వల్ల జీర్ణసంబంధిత సమస్యలు దూరమవుతాయి. మరోవైపు గొంగూర ఐరన్ ను పెంచటంలో తొడ్పడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ రెండింటితో మీకోసం ఒక టేస్టీ డిష్ .
తయారు చేయు విధానం
- Step 1
ఆరు గంటల పాటు నానబెట్టిన అలసందల్ని నీరు వడకట్టాలి.
- Step 2
కుక్కర్లో తాలింపు వేగాక గోంగూర, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అలసందలు వేసి 3 నిమిషాలు ఉడకబెట్టాలి.
- Step 3
తర్వాత రెండు కప్పుల నీరు పోసి రెండు విజిల్స్ రాగానే దించేయాలి.
- Step 4
చల్లారిన తర్వాత ఇష్టముంటే మెదుపుకోవచ్చు లేదంటే గింజలుగానే లాగించేయొచ్చు.
ఈ కూర చాలా రుచిగాను, అన్నంలోకే కాక వెజ్ బిర్యానిలోకి, చపాతీ, రోటీలలోకి చాలా బాగుంటుంది.