- Step 1
ముందుగా శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు కడాయిలో నూనె వేసి అది కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కర్వేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 3
ఇందులో గోంగూర వేసి కాసేపు వేయించాలి. తరువాత దోసముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
- Step 4
దోసముక్కలు ఉడికిన తరువాత ముందుగా ఉడికించుకున్న శనగపప్పు, ధనియాలపొడి, ఉప్పు, వేసి ఉడికించుకోవాలి.
- Step 1
కూర మొత్తం ఉడికిన తరువాత చివరగా కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన గోంగూర దోసకాయ పప్పు రెడీ. ఇది చపాతి, అన్నంలోకి బాగుంటుంది.