- Step 1
టమోటాల్ని సన్నగా, చక్రాల్లా తరిగి గింజలు తీయాలి.
- Step 2
కడాయిలో వెన్న వేడి చేసి అల్లం తరుగు, నువ్వులు, 2 టీ స్పూన్ల పంచదారతో పాటు టమోటా చక్రాలు వేయాలి. కరిగిన పంచదార, నువ్వులు టమోటా చక్రాలకు పట్టిన తర్వాత విరక్కుండా తీసి పక్కనుంచాలి.
- Step 3
ఒక పాత్రలో గుడ్లు గిలకొట్టి పంచదార పొడి, నూనె, మైదా, వెనిల్లా ఎసెన్స్, లవంగ, దాల్చినచెక్క పొడులు, బేకింగ్ పౌడర్ బాగా కలపాలి.
- Step 4
కేక్ చేసే పాత్ర అడుగున, పైన టమోటా చక్రాలు పరిచి మధ్యలో మైదా మిశ్రమం ఉంచి 150 డిగ్రీల దగ్గర 25 - 30 నిమిషాల సేపు ఓవెన్‌లో ఉంచాలి. ఈ కేక్‌ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.