- Step 1
ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి కలపాలి.
- Step 2
దీన్ని రెండు నుంచి మూడు గంటలు నానబెట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు ఉడుకుపట్టాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి.
- Step 3
బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి. అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందు నానబెట్టిన రొయ్యల్ని ఒక పొరలా వేయాలి.
- Step 4
వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను పొరలా పరవాలి. పైన నెయ్యి వేయాలి. ఈ గిన్నెను ఒక తవాపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి.
- Step 5
ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూతమీద వేయాలి.
- Step 6
20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి.
- Step 7
ఈ రొయ్యల బిర్యానీ ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా రుచిగా ఉంటుంది. అలా ఇష్టపడని వాళ్లు మిర్చి కా సలాన్ లేదా రైతాలతో బిర్యానీ లాగించేయచ్చు.