- Step 1
కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి.
- Step 2
శనగపప్పును కూడా మెత్తగా ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలను కూడా ఉడికించుకోవాలి.
- Step 3
ముక్కలు ఉడికిన తరువాత ఉడికిన శనగపప్పు, రుబ్బి పెట్టుకున్న కూటు ముద్ద అన్నీ కలిపి సొరకాయ ముక్కలకు జతచేయాలి.
- Step 4
ఇవన్నీ ఉడుకుతున్న సమయంలోనే పసుపు, ఉప్పు కూడా జత చేసుకోవాలి.
- Step 5
ఈ మిశ్రమం గట్టి పడుతున్న సమయంలో వేరొక బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి.
- Step 6
ఇవన్నీ వేగిన తరువాత ఉడుకుతున్న సొరకాయ మిశ్రమానికి జత చేయాలి..