- Step 1
స్టౌవ్‌మీద బాణెలి ని ఉంచి అందులో నూనె పోసి మరిగాక.. మసాలా దినుసులను వేసి వేయించాలి.
- Step 2
అందులోనే పుదీనా,కొత్తిమీర,పసుపు,పచ్చిమిర్చి పేస్ట్,యాలక్కాయల పొడి,కారం,ఉప్పు,బీన్స్,క్యారెట్ టమోటో,ఉల్లిపాయ ముక్కలు,పెరుగులను ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి.
- Step 3
ఇంకో గిన్నెలో బియ్యం ఎసరు పెట్టి, అందులో పాలు కూడా పోసి ఎసరు వచ్చాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి,సగం ఉడికాక గంజి వార్చేసి పక్కన ఉంచుకోవాలి.
- Step 4
వేరొక వెడల్పాటి పాత్రలో అడుగున ఉడికించిన రైస్ కొద్దిగా వేసి, పైన వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసి, మళ్లీ కొద్దిగా అన్నం.. ఇలా 4వరుసలుగా పేర్చుకోవాలి.
- Step 5
తర్వాత మూత పెట్టి 10ని. ఉడికించాలి. మూత తీసి సరిపడా నెయ్యేసి, అన్నాన్ని దించేయండి. బిర్యానీ రెడీ.