- Step 1
ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.
- Step 2
ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి. అందులో సుమారు 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.
- Step 3
ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి.
- Step 4
వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగ నివ్వాలి.
- Step 5
ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
- Step 6
ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
- Step 7
కుక్కర్ ఐతే మూడు కూతలు రాగానే కట్టేయ్యాలి. గిన్నెలో ఐతే అన్నం ఉడికాక గ్యాసు కట్టేయ్యాలి.