- Step 1
మామిడికాయల్ని కడిగి చిన్నముక్కలుగా కోసి ఎండలో పెట్టాలి. అనాసపువ్వు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- Step 2
తరువాత అందులో ఉల్లివిత్తులు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ కలపాలి.
- Step 3
ఇప్పుడు ఈ కారం మిశ్రమంలో ఆవనూనె వేసి కలపాలి. తరువాత ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి.
- Step 4
దీన్ని జాడీలోకి పెట్టి కిటికీకి దగ్గరగా అంటే సూర్యకాంతి నేరుగా తగలకుండా ఉండేచోట 15 రోజులపాటు ఉంచాలి. తరువాత అల్మరాలో పెట్టుకోవచ్చు.
- Step 5
అయితే ఎప్పటికప్పుడు పచ్చడిపైన నూనె ఉందో లేదో చూసుకుంటూ, తగ్గితే కాస్త పోస్తూ ఉండాలి. అంతే సింధీ ఆమ్ కా అచర్ సిద్ధమైనట్లే.