- Step 1
క్యారెట్ ను చిన్న సైజు ముక్కలుగా తరిగి నీళ్లలో వేసి ఉడికించి, నీటిని వంపేయాలి.
- Step 2
క్యారెట్ ముక్కల మాదిరిగానే బఠాణీలను కూడా విడిగా ఉడికించి ఉంచాలి.
- Step 3
ఓ బాణెలిలో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి దోరగా వేయించాలి.
- Step 4
అందులోనే అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, టొమాటో గుజ్జు వేసి దగ్గరగా ఉడికించాలి.
- Step 5
ఆపై దాంట్లో ఉడికించిన గాజర్ ముక్కలు, బఠాణీలను కూడా వేసి కలపాలి.
- Step 6
చివరగా ధనియాల పొడి చల్లి, ఉప్పు సరిచూసి కాసేపు ఉడికించి దించాలి. అంతే రెడ్ క్యారెట్ మటర్ రెడీ.