- Step 1
నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కాలీఫ్లవర్ ముక్కలను వేసి పది నిమిషాల తరువాత నీరంతా పోయేలా వడగట్టి పెట్టుకోవాలి.
- Step 2
బాణెలి లో నూనె వేడయ్యాక.. అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాలపొడి, కారం, పసుపు, నాలుగు టీస్పూ// నీటిని కలిపి వేయించాలి.
- Step 3
అందులోనే కాలీఫ్లవర్ ముక్కలను, ఉప్పును వేసి కలియబెట్టి మూతపెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి.
- Step 4
ఆ తరువాత ఆలూ ముక్కల్ని కూడా వేసి కలిపి మూతపెట్టి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించాలి.
- Step 5
అయితే మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
- Step 6
ఆపై గరంమసాలా, ఆమ్‌చూర్ పౌడర్‌ని కూడా వేసి కలియబెట్టి మూతలేకుండా మరో రెండు నిమిషాలు ఉడికించి.. చివర్లో కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి దించేయాలి. అంతే వేడి వేడి ఆలూ గోబీ కర్రీ రెడీ.