- Step 1
ఒక టీస్పూన్ నూనెలో గసగసాలు, రెండు ఉల్లిపాయల తరుగు, జీడిపప్పు, నువ్వులు వేసి దోరగా వేయించాలి.
- Step 2
చల్లారిన తరువాత ముందే నానబెట్టి ఉంచిన చింతపండుతో సహా ఉప్పు, కారం జతచేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
స్టవ్‌పై బాణీలి పెట్టి.. రెండు ఉల్లిపాయల తరుగు వేసి దోరగా వేయించాలి.
- Step 4
తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగి ఉంచుకున్న టొమోటో ముక్కల్ని వేసి వేయించాలి.
- Step 5
కాసేపటి తరువాత ముందే నూరి ఉంచుకున్న మసాలాను వేసి బాగా కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి.
- Step 6
దించేముందు మసాలాపొడి వేసి కలిపి. పైన కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతేటొమోటో మసాలా కర్రీ సిద్ధమైనట్లే.