- Step 1
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము వేసి దోరగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారాక మిక్స్ జార్ లో వేసుకుని తగినంత వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి.
- Step 2
తరువాత అదే పాన్ లో ఆయిల్ వేసి కీమా, సాల్ట్, పసుపు వేసి ఒక 5 నిముషాలు వేపుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని అందులో గుడ్డుని కొట్టి కలిపి పక్కన పెట్టుకోవాలి, ఈ మిశ్రమాన్ని మిర్చి లను మధ్యలో కట్ చేసుకుని అందులో వుండే గింజలు తీసేసి ఈ కీమా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. అలాగే అన్ని మిర్చిలను చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
మరల స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, వేసి చిటపటలాడాక ఉలిపాయముక్కలు, కర్వేపాకు వేసి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించి అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి బాగా వేపుకుని పసుపు , కారం , ధనియా పొడి, సాల్ట్ , ముందుగా చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ , తగినంత వాటర్ , పంచదార , వేసి కలిపి మూతపెట్టి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి.
- Step 4
ఉడికాక అందులో స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చి లను కూడా వేసి మూతపెట్టి మరో 5 నిముషాలు ఉడకనివ్వాలి . మూత తీసి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి ..