- Step 1
ముందుగా గోంగూర ఆకులను తీసుకుని శుభ్రం గా కడిగి పెట్టుకోవాలి. అలాగే రొయ్యలు కూడా చేసుకుని ఉంచుకోవాలి.
- Step 2
ఆ తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్, రొయ్యలు, పసుపు, సాల్ట్ , వేసి ఒక 5 నిముషాలు రొయ్యలు వెచ్చబెట్టుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి .
- Step 3
ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి కాగాక అందులో గొంగూర ఆకులను వేసి మగ్గించుకోవాలి
- Step 4
గొంగూర మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకుని చల్లారాక మిక్స్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి .
- Step 5
తరువాత వేరే పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, దంచుకున్న వెలుల్లిరెబ్బలు, ఎండుమిర్చి, కర్వేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, వేసి వేపుకోవాలి. వేగాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి మరి కాసేపు వేగనివ్వాలి.
- Step 6
ఇప్పుడు అందులో ముందుగా వెచ్చబెట్టుకున్న రొయ్యలు వేసి సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేపి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి.
- Step 7
ఇవి అన్ని ఉడికాక అందులో ముందుగా చేసి పెట్టుకున్న గొంగూర పేస్ట్ వేసి కలిపి ఒక 5 నిముషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించుకోవాలి.