- Step 1
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో పల్లీలు వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి , అదే పాన్ లో ఎండుమిర్చి , వెల్లుల్లిరెబ్బలు , కొబ్బరి తురుము వేసి వేపుకుని తీసుకోవాలి .
- Step 2
అదే పాన్ లో టమోటో ముక్కలు , పంచదార , సాల్ట్ వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి .
- Step 3
ఇప్పుడు మిక్స్ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించుకున్న పల్లీలు , కొబ్బరితురుము , అన్ని వేసి మిక్సీ పట్టాలి కొంచెం మెత్తగా అయ్యాక టమోటో మిశ్రమం కూడా వేసి మరొకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు , ఈ పచ్చడి ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
- Step 4
ఇప్పుడు చిన్న పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు , మినపప్పు , కర్వేపాకు వేసి కలిపి ఈ పోపు ని చేసిపెట్టుకున్న పచ్చడి లో వేసి కలుపుకోవాలి .. అంతే టమోటో పల్లి చట్నీ రెడీ …