- Step 1
ముందుగా బియ్యంని కడిగి రాత్రంతా నానపెట్టి, ఉదయం బియ్యం వార్చి ఆరబెట్టి పిండి ఆడించుకోవాలి .
- Step 2
ఇంకా బెల్లాన్ని మెత్తగా దంచుకుని పెట్టుకోవాలి, కొబ్బరికాయలను కొట్టి తురుము తీసుకోవాలి .
- Step 3
ఇప్పుడు బెల్లం తురుమును ఒక లోతైన గిన్నె లోకి తీసుకుని స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చేవరకు కలుపుతూ ఉండాలి, ఇప్పుడు కొంచెం వాటర్ ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఈ బెల్లం పాకం వేస్తె అది చేతి కి అంటుకునేలా ఉండాలి.
- Step 4
ఇప్పుడు ఆ పాకంలో కొబ్బరితురుము, ఇలాచీ పొడి వేసి కలిపి, డాల్డా కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి.
- Step 5
తరువాత ఈ బెల్లం మిశ్రమం లో బియ్యం పిండి కొంచెం కొంచెం వేస్తూ చెక్క గరిటతో కలుపుతూ ఉండాలి, దీనికి ఇద్దరు ఉండాలి ఒకరు పిండి పోస్తూ ఉంటే మరొకరు కలుపుతూ ఉండలు చుట్టకుండా కలపాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె ని కిందకి పెట్టి మరొకసారి పిండి అంత కాలేసాలగా కలుపుతూ మెత్తిన ముద్దలాగా కలుపుకోవాలి, ఇప్పుడు ఈ పిండి కొంచెం చల్లారాక అరటి ఆకు (లేదా మిల్క్ కవరు) ని తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని ఈ పిండి ని చేత్తో చిన్న చిన్న ముద్దగా తీసుకుని కవరు పైన చిన్న చిన్న పూరి లాగా చేత్తో వత్తుకోవాలి.
- Step 7
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కాగాక అందులో ఈ కొబ్బరి బూరెలు వేసుకుని రెండువైపులా దోరగా వేయించుకుని తీసుకోవాలి..