- Step 1
ఒక గిన్నె తీసుకుని అందులో మైదా, కొంచెం సాల్ట్, బొంబాయి రవ్వ, కొంచెం వాటర్ వేసి ముద్దగా కలుపుకుని అరగంట పక్కనపెట్టుకోవాలి.
- Step 2
శనగపప్పు ని కడిగి అరగంట నాననిచ్చి, పలుకులు గా ఉడక పెట్టుకుని చల్లారనివ్వాలి, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా చేసుకోవాలి.
- Step 3
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో బెల్లం తురుము, కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉండాలి, లేత పాకం వచ్చెనంత వరకు కలుపుకుని అందులో మిక్స్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసి కలుపుకుని దగ్గర పడే వరకు కలుపుకుని ఇలాచీ పొడి వేసి కలిపి దించుకుని చల్లారనివ్వాలి.
- Step 4
ఇప్పుడు అరటి ఆకూ ముక్క తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకుని దాని మీద ముందు గా కలిపి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం చేత్తో తీసుకుని ఆకూ మీద పరిచి దాని పైన శనగపప్పు బెల్లం మిశ్రమం చిన్న లడ్డు గా తీసుకుని మధ్యలో పెట్టి క్లోజ్ చేసి పూరి లాగా వత్తుకోవాలి.
- Step 5
చివరిగా స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టి వేడి ఎక్కాక దాని మీద ఈ బొబ్బట్టు వేసుకుని రెండు వైపులా నేయ్యితో కాల్చుకుని తీసుకోవాలి ..