- Step 1
ముందుగా శనగపప్పు ని రెండు గంటలు పాటి నాననివ్వాలి.
- Step 2
ఒక మిక్స్ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- Step 3
స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి అందులో డాల్డా వేసి కరిగే దాక ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
- Step 4
ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి, కరిగించుకున్న డాల్డా , సాల్ట్, వేసి బాగా కలుపుకోవాలి.
- Step 5
తరువాత ఇందులో నానపెట్టిన శనగపప్పు , వంటసోడా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కర్వేపాకు ముక్కలు , వేసి ఒక సారి బాగా కలిపి గోరు వెచ్చని వాటర్ కొంచెం కొంచెం వేస్తూ పిండి ని ముద్ద లాగా కలుపుకోవాలి ..
- Step 6
ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని ఈ పిండి ని చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కవరు పైన చిన్న చిన్న అప్పులు గా వత్తుకోవాలి.
- Step 7
ఇపుడు కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో చేసుకున్న చెక్కలు వేసుకుని రెండు వైపులా బాగా వేయించుకుని తీసుకోవాలి.