- Step 1
దొండకాయ లను శుభ్రం గా కడిగి నిలువుగా కట్ చేసుకోవాలి, జీడిపప్పు, బాదాం ఒక అరగంట వాటర్ లో వేసి నాననివ్వాలి.
- Step 2
ఇవి నానాక వీటిని మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి, ఈ పేస్ట్ ను ఒక గిన్నె లోకి తీసుకుని అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి .
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడిఎక్కక అందులో దొండకాయముక్కలు, సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి, వేగాక వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి.
- Step 4
అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి బిరియాని ఆకూ, ఉల్లిపాయా పేస్ట్ , కర్వేపాకు, వేసి వేగనివ్వాలి. వేగాక అల్లంవెల్లుల్లిపేస్ట్ వేసి కలిపి అందులో పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి , వేసి కలిపి అందులో ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు ,బాదాం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
- Step 5
అందులో ఎండుకొబ్బరిపొడి వేసి కలుపుకుని కొంచెం వాటర్ వేసుకుని కలిపి మూతపెట్టి ఒక రెండు నిముషాలు ఉడకనివ్వాలి, ముతతీసి అందులో ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కలు, గరం మసాలా, తగినంత సాల్ట్ వేసి కలిపి వేగనివ్వాలి, స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి దించుకోవాలి ..
- Step 6
అంతే దొండకాయ మసాలా రెడీ..