- Step 1
స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో మిల్క్ వేసి మరగనివ్వాలి, మరిగాక అందులో నిమ్మరసం పిండుకోవాలి, ఇలాచేయడం వల్ల పాలు విరిగిపోతాయి, స్టవ్ అఫ్ చేసుకుని చల్లారక ఈ మిశ్రమాన్ని జల్లెడ లో ఒక మెత్తటి చిన్న టవల్ వేసుకుని అందులో విరిగిన పాలు పోసుకుని గట్టి గా నీళ్లు పిండుకుని దాన్ని ఒక అరగంట పాటు అలావుంచాలి.
- Step 2
తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా చేతితో కలుపుకోవాలి ఒక పది నిముషాలు పాటు , ఇలా చేయడం వల్ల రసగుల్లా మెత్తగా వస్తాయి, వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఒక కప్పు పంచదార, మూడు కప్పుల నీరు పోసుకుని పది నిముషాలు బాయిల్ చేసుకోవాలి, ఇందులో ముందుగా చేసిపెట్టుకున్న ఉండలు వేసుకుని కలిపి పదిహేను నిముషాలు పాటు మూతపెట్టి ఉడకనివ్వాలి… తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి.
- Step 4
చల్లారాక గిన్నెలో రసగుల్లాలు తీసుకుని పైన కొంచెం పంచదార పాకం, కుంకుమపువ్వు వేసుకుని సర్వ్ చేసుకోవాలి .