- Step 1
ముందుగా చికెన్ జాయింట్స్ ను తీసుకుని కడిగి చాకు తో గాట్లు పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో అల్లంవెల్లుల్లిపేస్ట్, కారం, పెరుగు, కస్తూరిమేతి (నలిపి), గరం మసాలా, ఆంచూర్ పొడి, నిమ్మరసం, తందూరీ మసాలా, సాల్ట్, ఫుడ్ కలర్, అన్ని వేసుకుని బాగా కలుపుకోని ముద్దలా చేసుకోవాలి.
- Step 3
చికెన్ జాయెంటు ముక్కలను తీసుకొని తయారుచేసుకున్న ఈ పేస్ట్ ను ముక్కలకు బాగా పట్టించి మూతపెట్టుకుని ఒక గంటపాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి ..
- Step 4
గంట తరువాత ముక్కలను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఒక పాన్ లో వేసుకుని స్టవ్ మీదపెట్టుకుని చిన్నమంట మీద ఒక పదినిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి.
- Step 5
మూత తీసి చికెన్ ముక్కలను తిప్పుకుని మరల పదినిమిషాలు కుక్ చేసుకోవాలి, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి.
- Step 6
ఇప్పుడు గ్రిల్ తీసుకుని దానికి ఆయిల్ కొంచెం రాసుకుని స్టవ్ వెలిగించి దాని పైన పెట్టుకుని దానిపైన చికెన్ ముక్కలను పెట్టుకుని పెద్దమంట మీద కొంచెం మరల చిన్నమంటమీద కొంచెం రెండు వైపులా త్రిప్పుకుంటూ కాల్చుకోవాలి ….. అంతే చికెన్ తందూరీ రెడీ