- Step 1
ముందుగా బాస్మతి రైస్ ను కడిగి అరగంటపాటు నాననివ్వాలి .
- Step 2
ఇప్పుడు టమోటోలను కడిగి ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి అందులో ముక్కలు మునిగే వరకు నీరు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి, స్టవ్ ఆఫ్ చేసి దించుకుని చల్లారాక మెత్తగా చేసుకుని టమోటో రసం తీసుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నెయ్యి / ఆయిల్ వేసి వేడి ఎక్కాక జీలకర్ర, బిరియాని ఆకూ , ఇలాచీ, లవంగం, చెక్క, స్టార్, షాజీరా వేసి వేపాక జీడిపప్పు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి వేగనివ్వాలి.
- Step 4
ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాసేపు వేపి అందులో పసుపు, కారం, ధనియాలపొడి , సాల్ట్ , గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని అందులో ముందుగా నానపెట్టిన బాస్మతి రైస్ వేసి కలిపి ముందుగా ఉడికించిన టమోటో రసం ఒక కప్పు కి రెండుకప్పుల టమోటో రసం వేసి కలిపి కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి విజిల్ చల్లారాక మూతతీసుకుని వేడి వేడి గా వడ్డించుకోవాలి