- Step 1
ఒక గిన్నె తీసుకుని అందులో ఓట్స్ , బియ్యం పిండి , పెరుగు , సాల్ట్, తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
- Step 2
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు , జీలకర్ర , మినపప్పు వేసి వేపుకోవాలి, వేగాక ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చిముక్కలు , కార్వే పాకు, క్యారెట్ తురుము వేసి ఒక రెండు నిముషాలు వేయించుకుని కొత్తిమీర వేసి దించుకోవాలి .
- Step 3
ఈ మిశ్రమాన్ని ఓట్స్ పిండి లో కలిపి తగినంత సాల్ట్ , ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసుకుని కలిపి పక్కనపెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంట పొంగనాల పాన్ పెట్టుకుని వేడి ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం కొంచెం గా పిండి వేసుకుని మూతపెట్టి ఉడకనివ్వాలి, మూతతీసి ఫోర్క్ తో తిరగేసుకోవాలి , ఇలా రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి . అంతే వేడి వేడి ఓట్స్ గుంట పొంగనాలు రెడీ …