- Step 1
ఒక పాన్ తీసుకుని అందులో ఫుడ్ రమ్ సగం వేసి అందులో చెక్క, లవంగం , ఇలాచీ వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి చిన్నమంటమీద మరగనివ్వాలి .
- Step 2
బాగా మరిగాక అందులో జీడిపప్పు , కిస్ మిస్ వేసి కలుపుకుని రెండు నిముషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి అందులో ట్రూటి ఫ్రూటీ వేసుకుని కలుపుకుని పక్కన ఉంచుకోవాలి , ఇప్పుడు చల్లారాక అందులో నుంచి చెక్క, ఇలాచీ , లవంగం తీసేయాలి .
- Step 3
ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్లను పగలకొట్టుకుని వేసుకుని , వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి, ఇప్పుడు బట్టర్ వేసి బాగా కలుపుకోవాలి, ఇందులో ముందుగా ఫుడ్ రమ్ లో బాయిల్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ సగం, వేసుకుని మరొకసారికలిపి బేకింగ్ పౌడర్, బ్రౌన్ షుగర్ , మైదా, బాదాం పప్పు అన్ని వేసి బాగా కాపుపుకోవాలి అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని పెట్టుకోవాలి .
- Step 4
ఒక బేకింగ్ గిన్నె తీసుకుని దానికి లోపల కొంచెం బట్టర్ అప్లై చేసుకుని అందులో ఈ కేక్ మిశ్రమాన్ని వేసుకుని దానిపైన ముగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒక సారి గిన్నెను కిందకు అటు, ఇటు కొట్టాలి ( ఇలా చేస్తే కేక్ మిశ్రమం అంత ఒక లెవల్ గా ఉంటుంది )
- Step 5
ఇప్పుడు దీన్ని ఒవేన్ లో 100 డిగ్రీ c వద్ద 35 నిముషాలు bake చేసుకోవాలి …35 నిముషాలు అయ్యాక తీసుకుని చల్లారాక కేక్ గిన్నెను ఒక ప్లేట్ లోకి తిరగేసుకోవాలి . ఇప్పుడు కేక్ మీద టూత్ పిక్ తో గుచ్చుకుని దానిపైన మిగిలిన ఫుడ్ రమ్ ను స్పూన్ తో కేక్ అంతా వేసుకోవాలి .. ఇది వెంటనే పీల్చేసుకుంటుంది ..