- Step 1
చికెన్ జాయింట్స్ ను శుభ్రం గా కడిగి చాకు తో గాట్లు పెట్టుకోవాలి .
- Step 2
ఒక గిన్నె తీసుకుని అందులో సాల్ట్ , కారం , పసుపు , అల్లం వెల్లుల్లి పేస్ట్ , ధనియాల పొడి , జీలకర్రపొడి , మిరియాల పొడి , చికెన్ మసాలా , నిమ్మకాయ రసం ,పంచదార , పచ్చిమిర్చి ముక్కలు , కొతిమీరతురుము , అజినమోటో అన్ని వేసి బాగా కలుపుకోవాలి
- Step 3
ఇప్పుడు ఇందులో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుని , గుడ్డు ను పగలకొట్టుకుని అందులో వేసి బాగా కలుపుకోవాలి ...
- Step 4
అందులో ముందుగా కడిగి గాట్లు పెట్టుకున్న చికెన్ జాయింట్స్ వేసి మసాలా అంత బాగా పట్టేలాగా కలుపుకుని ఫ్రిడ్జ్ లో ౩౦ నిముషాలు పాటు ఉంచుకోవాలి .ఇప్పుడు చికెన్ ముక్కలు బయటకు తీసుకుని అందులో మనకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి .
- Step 5
ఇప్పడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని కాగనివ్వాలి , ఆయిల్ కాగాక అందులో చికెన్ జాయింట్స్ ను ఒక్కొకటి నెమ్మదిగా అందులో వేసుకుని రెండు వైపులా వేయించుకుని పేపర్ పరిచిన ప్లేట్ లోకి తీసుకోవాలి
- Step 6
అదే ఆయిల్ లో కర్వేపాకు కూడా వేసి వేయించుకుని తీసుకోవాలి.. ఈ కర్వేపాకు ను చికెన్ జాయింట్స్ పైన వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి .