- Step 1
ముందుగా కారట్ కడిగి చిన్న , చిన్నముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి .
- Step 2
స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో తరిగి పెట్టుకున్న కారట్ ముక్కలు , సగం జీడిపప్పు బాదాం, అరకప్పు మిల్క్ వేసి మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి , చల్లారాక మూత తీసి మిక్స్ జార్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసిపెట్టుకోవాలి .
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి సగం బాదాం జీడిపప్పు లు వేసి వేయించుకుని పక్కనపెట్టుకోవాలి , అదే పాన్ లో మిల్క్ పోసి మరగనివ్వాలి , బాగా మరిగాక అందులో పంచదార వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి .
- Step 4
ఇందులో ముందుగా చేసుకున్న కారట్ పేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఉడకనివ్వాలి ..ఇందులో ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ,బాదాం , వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇలాచీపొడి వేసి దించుకోవాలి ..