- Step 1
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి ఎక్కాక పెసరపప్పు ను వేసి చిన్నమంటమీద దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి , చల్లారాక పెసరపప్పు ను మిక్స్ జార్ లో వేసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి .
- Step 2
మరల చిన్న పాన్ పెట్టి వేడి అయ్యాక అందులో నెయ్యి వేసి కాగాక అందులో జీడిపప్పుముక్కలు, బాదంపప్పు ముక్కలు, వేసి వేయించి పక్కనపెట్టుకోవాలి .
- Step 3
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పెసర పిండి , ఎండు కొబ్బరిపొడి , బెల్లం తురుము, ముందుగా వేయించిపెట్టుకున్న డ్రైఫ్రూట్స్ నెయ్యితో సహా వేసుకోవాలి , ఇలాచీపొడి , వేసి బాగా కలుపుకుని అందులో తగినంత పాలు వేసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి ..
- Step 4
అంతే పెసరకొబ్బరి లడ్డు రెడీ..
- Step 5
పెసరకొబ్బరి లడ్డు పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు.. ఈ పెసరకొబ్బరి లడ్డు టేస్ట్ కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎందుకంటే ఇందులో బెల్లం కూడా వుంది కాబట్టి ఇంకా మంచిది .