- Step 1
ఒక గిన్నె లో పనసపొట్టుని తీసుకుని అందులో నీరు వేసి బాగా కడిగి నీటిపై తేలిన పొట్టును మాత్రం తీసుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులోకి పనసపొట్టు వేసి, ఇందులో తగినంత నీరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీరు వార్చి చల్లారనివ్వాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి , 3 ఎండుమిరపకాయలు , నువ్వులు వేసి వేయించుకుని , చల్లారాక మిక్స్ జార్ లో తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి .
- Step 4
తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి , వేగాక ఉడికించిన పనసపొట్టుని వేసి కలపాలి.
- Step 5
సన్నని మంటమీద నీరంతా ఇగిరిన తర్వాత నువ్వులపొడి మిశ్రమాన్ని కలిపి మరికొంతసేపు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవపిండి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని దించుకోవాలి …అంతే ఆవపెట్టిన నువ్వుల పనసపొట్టు ఫ్రై రెడీ