- Step 1
ముందుగా పుదీనా, కొత్తిమీర , పచ్చిమిర్చి , ఈ మూడు కలిపి మిక్సీ లో వేసి పేస్ట్ తాయారు చేసుకోవాలి .
- Step 2
ఇప్పుడు కుక్కర్ పెట్టి వేడి అయ్యాక అందులో నెయ్యి, వేసి గరం మసాలా దినుసులు వేసి వేగాక, అందులో జీడిపప్పు , ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి , బాగా వేగాక అల్లం వెల్లుల్లు పేస్ట్ , వేసి పచ్చి వాసన పోయే వరకు వేపాలి .
- Step 3
ఇందులో ముందుగా చేసుకున్నపుదీనా పేస్ట్ వేసి బాగా కలిపి సాల్ట్ వేసుకోవాలి .
- Step 4
ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కలిపి 1 కప్ రైస్ కి ఒకటిన్నర కప్పుల నీరు పోసి కలిపి , కుక్కర్ ముథ పెట్టుకోవాలి , 2 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని,సర్వ్ చేసుకోవాలి. అంతే పుదీనా పులావ్ రెడీ ..