- Step 1
ముందుగా దోస పిండి ( ఒక కప్ మినపప్పు , రెండు గ్లాస్ బియ్యం వేసి ఆరు గంటలు పాటు నానబెట్టి పిండి రుబ్బుకోవాలి ) తీసుకుని అందులో సాల్ట్ , వేసి బాగాకలిపుకోవాలి .
- Step 2
ఇప్పుడు దోస పాన్ పెట్టి వేడి ఎక్కాక దాని పైన మందంగా దోస పిండి పోసుకోవాలి పరచకూడదు.
- Step 3
ఇప్పుడు దాని మీద క్యాప్సికమ్ ముక్కలు,కారట్ ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు (ముక్కలు క్యూబ్స్ లా కట్ చేసుకుంటే పిజ్జా లుక్ బాగా వస్తుంది ), స్వీట్ కార్న్ , వేసి మూత పెట్టి, చిన్న మంట పైన ఉంచాలి.
- Step 4
5 నిముషాలు అయ్యాక మూత తీసి దానిపైన చిల్లి ప్లేక్స్, ఒరేగనో, బట్టర్ / ఛీజ్ వేసి మరో 5 నిముషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి.
- Step 5
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిజ్జాకట్టర్ తో కట్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకుని టమోటో సాస్ తో సర్వ్ చేసుకోవాలి …