- Step 1
స్టవ్ పై పాన్ పెట్టి వేడి ఎక్కాక పల్లీలు, నువ్వులు వేయించి తీసుకోవాలి .
- Step 2
ఇప్పుడీ వీటిని మిక్స్ జార్ లో వేసి పొడి గా చేసుకుని పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు అదే జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఎండుకొబ్బరి వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి .
- Step 4
ఇప్పుడు వంకాయలను (గుత్తి వంకాయలు) గా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 5
ఇప్పుడు ముందుగా చేసుకున్నా , నువ్వుల , పల్లీల ,పొడి మరియు ఉల్లిపాయ పేస్ట్ ను రెండు కలిపి తగినంత సాల్ట్ , పసుపు ,వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి .
- Step 6
ఇప్పడు గుత్తి వంకాయలు మధ్యలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి .
- Step 7
ఇప్పడు పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కక, అందులో ఆవాలు , జీలకర్ర , మినపప్పు , కర్వేపాకు వేసి వేపాలి .
- Step 8
అందులో ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి కలిపి కొంచెం సాల్ట్ పైన చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి .
- Step 9
మగ్గాక మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలిపి కొంచెం వాటర్ వేసి కలిపి మిగతా స్టఫ్ ఏమైనా ఉంటే అది కూడా వేసి ఒకసారి కలిపి మరల మూత పెట్టి చిన్న మంట మీద 5 నిముషాలు పాటు మగ్గించి కొత్తిమీర వేసి స్టవ్ ఆపు చేసుకుని దించుకోవాలి … అంతే కమ్మ కమ్మని నువ్వుల గుత్తివంకాయ కర్రీ రెడీ .