- Step 1
ముందుగా ఆలూని ఉడకపెట్టుకుని , తొక్క తీసేసి దాన్ని ముద్దగా చేసుకుని పెట్టుకోవాలి .
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు వేసి చిటపట లాడక, అందులో జీలకర్ర వేసి వేపి అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కర్వేపాకు వేసి వేపాలి అందులో పసుపు, సాల్ట్, వేసి కలిపి ముందుగా ఉడకపెట్టుకున్న ఆలు మిశ్రమం ని వేసి కలిపి కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకుని దించుకోవాలి .
- Step 3
ఇప్పుడు ఈ ఆలు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి .
- Step 4
ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పిండి , బియ్యం పిండి , వాము , సాల్ట్ , కారం , వంటసోడా , వేసి అన్ని బాగా కలుపుకోవాలి . ఇప్పడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ని జారుడు గా కలుపుకోవాలి ( బజ్జి పిండి లాగా )
- Step 5
ఇప్పుడు పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి వేడి ఎక్కనివ్వాలి. బజ్జిపిండి లో ఆలు మిశ్రమం ఉండని ముంచి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
- Step 6
ఆలా మిగతావన్నీ కూడా వేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకుని తీసుకోవాలి … అంతే నోరూరించే ఆలూ బోండా రెడీ