- Step 1
బాస్మతి బియ్యాన్ని కడిగి కనీసం 30 నిమిషాలు నానబెట్టుకోవాలి.
- Step 2
అలాగే వేడినీటిలో మీల్ మేకర్, కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టాలి.
- Step 3
తర్వాత నీరు మొత్తం పోయేలా మీల్‌మేకర్‌ను చేతులతో పిండాలి.
- Step 4
తర్వాత మిల్ మేకర్ లో ఉప్పు, కారం,గరం మసాలా వేసి కలిపిపెట్టుకోవాలి.
- Step 5
ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించాలి.
- Step 6
- Step 7
ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, వేసి బాగా వేపి ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మూడు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. 5 నిమిషాలు తరువాత మూత తీసి వేడివేడిగా వడ్డించుకోవడమే రెడీ ఐన మీల్‌మేకర్ పులావ్…