- Step 1
ముందుగా చిలకడ దుంపను ఉడకపెట్టుకుని తొక్కతీసేసి మెత్తగా పేస్ట్ గ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వాటర్ వేసుకుని అందులో స్వీటీకార్న్ ,బీన్స్, కారట్, గోభి ముక్కలను వేసుకుని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి.
- Step 3
మరల స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయముక్కలు, సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి, వేగాక అందులో కాప్సికం ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి.
- Step 4
అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజ్టేబుల్స్ వేసి కలిపి అందులో ఒరేగనో, చాట్ మాసాల, గరం మసాలా, ఆంచూర్ పొడి అన్ని వేసి బాగా కలిపి అందులో ముందుగా ఉడకపెట్టుకున్న చిలకడదుంప మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకుని దించుకోవాలి.
- Step 5
ఇపుడు ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ముద్దగా చేసుకుని రౌండ్ గా చేసి వత్తుకుని బ్రెడ్ పొడి లో దొర్లించుకుని పక్కన పెట్టుకోవాలి, ఆలా అన్ని చేసి ప్లేట్ లోకి పెట్టుకోవాలి ..
- Step 6
ఇప్పుడు స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి పరుచుకుని దాని మీద మనం చేసుకున్నటిక్కాలను వేసుకుని రెండు వైపులా దోరగా వేయించుకుని తీసుకోవాలి…అంతే ఎంతో రుచికరమైన వెజ్ మిక్స్డ్ స్వీట్ పొటాటో టిక్కా రెడీ