- Step 1
సాస్ తయారీ : ఒక గిన్నె తీసుకుని అందులో వెనిగర్, రెడ్ చిల్లి పేస్ట్, సొయా సాస్, అజినమోటో, పంచదార, టమోటో కెచప్ అన్ని వేసుకుని బాగా కలుపుకొని సాస్ తయారుచేసుకోవాలి.
- Step 2
ముందుగా గోబీ ని చిన్న ముక్కలు గా కట్ చేసుకుని వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని కలిపి అందులో గోబీ ముక్కలు వేసుకుని ఒక పది నిముషాలు ఉంచుకోవాలి.దీని వలన గోబీ లో వున్నా క్రిములు బయటకు పోతాయి
- Step 3
ఒక గిన్ని తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, సాల్ట్, కొంచెం వాటర్ వేసి కలుపుకుని అందులో గోబీ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక గోబీ ముక్కలు ని వేసి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి .
- Step 5
తరువాత వేరే పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని , వెల్లుల్లి ముక్కలు, కర్వేపాకు వేసి వేగనివ్వాలి.
- Step 6
ఇందులో ముందుగా చేసుకున్న సాస్ వేసుకుని బాగా కలిపి అందులో వేయించిపెట్టుకున్న గోబీ ముక్కలను కూడా వేసి బాగా కలిపి లాస్ట్ ఉల్లికాడల ముక్కలు వేసుకుని దించుకోవాలి ….