- Step 1
ముందుగా చికెన్ ను శుభ్రం గా కడుక్కొని అందులో సాల్ట్ , పసుపు , కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ , ధనియాల పొడి , పెరుగు వేసి బాగా కలుపుకుని ఒక గంట పాటు నాననివ్వాలి ….
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి వేడి ఎక్కాక ఉల్లిపాయ పేస్ట్ , పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేపుకోవాలి .
- Step 3
వేగాక అందులో ముందుగా నానా పెట్టుకున్న చికెన్ మిశ్రమం వేసుకుని కలిపి మూత పెట్టి ఒక 5 నిముషాలు మగ్గనివ్వాలి , మూత తీసి కలిపి అందులో కొంచెం సాల్ట్ , చికెన్ మసాలా, జీడీ పప్పు పేస్ట్ వేసి కలిపి ఉడకనివ్వాలి . ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలిపి 5 నిముషాలు ఉడకనివ్వాలి, దగ్గరకి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవాలి ….
- Step 4
అంతే ఎంతో రుచికరమైన దహీ చికెన్ కర్రీ రెడీ ….