- Step 1
ముందుగా ఆలు, కారట్, గోబీ, బీన్స్, బీట్ రూట్, అన్ని కడిగి కట్ చేసుకుని కుక్కర్ లో వేసుకుని తగినంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి . అవి చల్లరాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బట్టర్ వేసి కరిగాక అందులో జీలకర్ర వేసి వేపాలి, వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కాప్సికం ముక్కలు వేసి వేపాలి .. ఇవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి, అందులో పసుపు, కారం, గరం మసాలా, అన్ని వేసి బాగా వేపుకోవాలి.
- Step 3
అందులో ఇప్పుడు టమోటో ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి, మగ్గాక అందులో సాల్ట్ , పంచదార వేసి కలిపి అందులో తగినంత వాటర్ వేసి కలిపి అందులో పచ్చి బఠాణి వేసి 5 నిముషాలు ఉడకనివ్వాలి .
- Step 4
ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి మెత్తగా చేసిపెట్టుకున్న ఆలు మిశ్రమం వేసి బాగా కలిపి పది నిముషాలు పాటు కుక్ చేసుకోవాలి .. ఇందులో ఇప్పుడు పావ్ భాజీ మసాలా కూడా వేసి బాగాకలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర, నిమ్మరసం వేసి దించుకోవాలి.
- Step 5
చివరిగా ఇప్ప్పుడు స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టుకుని కొంచెం బట్టర్ వేసుకుని పావ్ బన్స్ ని కట్ చేసుకుని బట్టర్ లో రెండు వైపులా వేయించుకోవాలి ….
- Step 6
ఇప్పుడు ప్లేట్ లోకి బట్టర్ లో వేయించుకున్న పావ్ ను తీసుకు ని పక్కన భాజీ మసాలా వేసుకుని పైన కొత్తిమీర , ఉల్లిపాయముక్కలు , నిమ్మరసం పిండుకుని … సర్వ్ చేసుకోవాలి ….
- Step 7
అంతే ఎంతో యమ్మీ, యమ్మీ పావ్ భాజీ మసాలా రెడీ .