- Step 1
ముందుగా పప్పు ని కడిగి నీరు పోసి అరగంట నాననిచ్చి ఉడక పెట్టుకుని పక్కనపెట్టుకోవాలి .
- Step 2
మైసూర్ మసాలా పొడి :
- Step 3
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి తురుము అన్ని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మిక్స్ జార్ లో తీసుకుని చల్లారాక మెత్తగా పొడి చేసుకొవాలి .
- Step 4
మరల స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో టమోటో ముక్కలు, చింత పండురసం, పసుపు, కర్వేపాకు, బెల్లం, సాల్ట్ వేసి కలిపి ఉడకనివ్వాలి .
- Step 5
ఉడికాక అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ను వేసి కలిపి కొంచెం నీరు పోసి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి .
- Step 6
అందులో ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి మరో 5 నిముషాలు మరగనిచ్చి దించుకోవాలి .