- Step 1
ముందుగా మెంతికూర ఆకులను తీసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి .
- Step 2
పప్పు ని కూడా కడిగి ఒక అర గంట నాననిచ్చి , అందులో తగినంత వాటర్ వేసి ఉడకపెట్టుకుని పక్కనపెట్టుకోవాలి .
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు , జీలకర్ర , వెల్లుల్లి రెబ్బలు (దంచినవి) , ఎండు మిర్చి , కర్వేపాకు , అన్ని వేసి వేపుకోవాలి , అందులోనే ఇంగువ కూడా వేసి వేపాలి .
- Step 4
ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చిముక్కలు, వేసి బాగా వేపాలి . తర్వాత ఇందులో మెంతికూర ను కూడా వేసి వేపి కొంచెం సేపు మగ్గక టమోటో ముక్కలను కూడా వేసి వేపుకుని ఒక 5 నిముషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి .
- Step 5
మగ్గాక అందులో సాల్ట్ , కారం , పసుపు ,వేసి కలుపుకుని అందులో ముందుగా ఉడక పెట్టుకున్న పప్పు ను కూడా వేసి కలిపి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసి కలిపి ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి … స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు రెడీ …