- Step 1
ముందుగా బీరకాయలను తొక్కతీసి నాలుగు ముక్కలుగా పెద్దగా కట్ చేసుకోవాలి, ఇప్పుడు వీటికి గుత్తి వంకాయలాగా గాట్లు పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయముక్కలు, నువ్వులపొడి, ఎండుకొబ్బరి తురుము, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపేస్ట్, ధనియాలపొడి వేసి మిక్స్ పట్టాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని అందులో తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి , దీన్ని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్క మధ్యలో స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి.
- Step 4
తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు, వేసి వేగాక అందులో స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయముక్కలను వేసి మూతపెట్టి చిన్నమంట మీద ఉడకనివ్వాలి.
- Step 5
ఇవి ఉడికాక అందులో చింతపండు రసం , కొంచెం సాల్ట్ వేసి ఒక సారి కలిపి మరల మూతపెట్టి 5 నిముషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించుకోవాలి … అంతే గుత్తి బీరకాయ రెడీ