- Step 1
ఒక గిన్నె లో చింత పండు తీసుకొని, అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి చింతపండు రసం తీసుకోవాలి, అల్లం, ఆవాలు కచ్చపచ్చ గా దంచి పెట్టుకోవాలి
- Step 2
ఒక గ్లాసు బియ్యానికి రేండు గ్లాసులు నీళ్ళు పోయాలి. అన్నం వుడికిన తరవాత విశాలంగా వున్న ఒక పెద్ద పల్లెము లోకి తీసుకోని చల్లార్చుకోవాలి. ( కావాలంటే చిటికెడు పసుపు అన్నం లో నీళ్లు వేసినప్పుడే వేసుకోవచ్చు )
- Step 3
స్టౌవ్ వెలిగించి గిన్ని పెట్టి చింతపండు రసం అందులో పసుపు , ఉవ్ప్పు, ఇదు పచ్చి మిర్చి నిలువుగా చేల్చినవి వేసి బాగా చిక్క పడే వరకు మరిగించి చింతపండు గుజ్జు తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి
- Step 4
అన్నం చల్లగా అయిన తరవాత, అందులో దంచిన అల్లం ఆవాలు పేస్టుకలిపి , చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలి.
- Step 5
తరవాత కడాయిని పోయిమీద పెట్టి అందులో నూనే పోసి వేడెక్కించాలి. నూనే కాగిన తరవాత అందులో ఆవాలు వేసి కొంచం చిటపట లాడిన తరవాత అందులో పచ్చి మిర్చి ,పచ్చిసెనగపప్పు, పళ్ళీలు, మినప పప్పు, ఇంగువ, ఎండు మిర్చి, కర్వేపాకు వేసి బాగా వేయించి అన్నంలో కలుపకోవాలి. అంతే! ఏంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ.