- Step 1
ముందుగా వంకాయలను గుత్తి వంకాయలు లాగ కట్ చేసి, సాల్ట్ వాటర్ లో వేసుకుని ఉంచుకోవాలి.
- Step 2
మిక్సింగ్ జార్ తీసుకుని అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుకొబ్బరి ముక్కలు, అల్లం ముక్క , వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకోవాలి .
- Step 3
ముందుగా నానబెట్టిన బాదాం ,జీడిపప్పుని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి .
- Step 4
పాన్ పెట్టి ఆయిల్ వేసి వంకాయలను వేయించుకోవాలి, అందులోనే మిర్చిని కూడా కొంచెం కట్ చేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి (ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది).
- Step 5
ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీరకర్ర, ఎండుమిర్చి, కర్వేపాకు, వేసి వేగాక అందులో ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా వేయించాలి.
- Step 6
అవి వేగాక అందులో పసుపు, బాదాం, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి నూనె తేలేంతవరకు వేయించాలి. అందులో తగినంత సాల్ట్, జీరాపొడి,ధనియ పొడి వేసి కలపాలి .
- Step 7
ఇప్పుడు ఇందులో చింతపండు రసం కొద్దిగా వేసి, తగినంత వాటర్ వేసి కలిపి అందులో ముందుగు వేయించుకున్న వంకాయలు, మిర్చి వేసి కలిపి ఒక 5 నిముషాలు తక్కువ మంట మీద బాగా ఉడకనివ్వాలి. . చివరిగా కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకోవాలి